గిద్యోను మరణించినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు కొత్త న్యాయాధిపతిని,నాయకుడిని పంపాడు. అతని పేరు సమ్సోను. సమ్సోనుతో అతని తల వెంట్రుకలు ఎప్పుడు కత్తిరించుకోకూడదని చెప్పాడు."నీవు గనుక నీ తల వెంట్రుకలు కత్తిరించకుండా ఉన్నట్లయితే, నిన్ను భూమి మీద జీవించే వాళ్ళందరికంటే బలవంతుణ్ణి చేస్తాను"అని చెప్పాడు. సమ్సోను దేవుడు మాట విని తన తల వెంట్రుకలు కత్తిరించుకోలేదు. గనుక అతనికి పొడవైన జుట్టు, బారు గడ్డం ఉండేవి.
ఒక యువకుడిగా సమ్సోను సింహబలుడని అప్పటికే నిరూపించుకున్నాడు. ఒకసారి తన పై దాడిచేసిన ఒక పెద్ద బలమైన సింహముతో అతడు పోరాడినాడు. అయితే సమ్సోను ఎంత బలవంతుడంటే, ఒట్టి చేతులతోనే ఆ సింహాన్ని తేలిగ్గా చంపేశాడు.
ఇశ్రాయేలియులకు తమ పొరుగువాలతో చాలా సమస్యలొచ్చేవి, మరి ముఖ్యంగా ఫిలిష్తీయులతే, వాళ్ళకి ఎన్నో సమస్యలు సృష్టించేవారు. ఒక రోజు రాత్రి సమ్సోను గాజా అనే పట్టణంలో బసచేస్తున్నప్పుడు. ఆ పట్టణానికి చుట్టూ ఎతైన పెద్ద గోడలు, భద్రత కోసం పెద్ద ద్వారాలు ఉండేవి. సమ్సోను ఆ పట్టణంలో ఉన్నాడని ఫిలిష్తీయులు కనిపెట్టినప్పుడు, వాళ్ళు అతన్న పట్టుకోవాలనుకున్నారు. పట్టణం లోపలే అతన్ని బంధించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పెద్ద ద్వారాలకు తాళం వేశారు. అయితే సమ్సోను ఆ ద్వారాలను సులభంగా గోడలోనుంచి ఛేదించి, వాటిని తన భుజాల మీద వేసుకొని ఊరుదాటి వెళ్ళిపోయాడు. సమ్సోను ఎంత బలవంతుడో చూచిన ఫిలిష్తీయులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

-నవీన్ కుమార్ యెలుమర్తి-
No comments:
Post a Comment