మోషే ఇశ్రాయేలుయలను ఐగుప్తు నుండి బయటకి నడిపిస్తున్నాడు. పగలు పూట దేవుడు తన ప్రజలకు ముందుగా ఒక దట్టమైన మేఘములోను, రాత్రివేళ ఒక మండే అగ్నిలోను వెళ్ళాడు. ఆ విధంగా తన ప్రజలను పగలు రాత్రి నడిపించాడు.మార్గంలో వాళ్లకి పెద్ద సముద్రం ఎదురయ్యింది. దాని పేరు ఎర్ర సముద్రం. అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకున్నారు.అయితే, ఫరో తన నిర్ణయాన్ని బట్టి మనసు మార్చుకొని ఇశ్రాయేలీయులను మరలా ఐగుప్తుకు తీసుకు రమ్మని తన సైన్యాలను పంపాడు.
ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు . ఎందుకంటే వాళ్ళు పడవలు వేసుకుని సముద్రం దాటి ఫరో సైన్యాన్ని తప్పించుకొని వెళ్లే సమయం కుడా వారికి లేదు. మోషే, వాళ్ళతో ఇలా చెప్పాడు. "భయపడకండి,దేవుడు మనకు సహాయం చేస్తాడు." అప్పుడు దేవుడు ఒక బలమైన గాలిని పంపాడు, అది ఎంత గట్టిగ వీచిందంటే,నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులకు విశాలమైన దారి ఏర్పడింది. ఆ దారి సముద్రం అవతలి వైపు వరకు ఏర్పడింది. ఇప్పడు ఇశ్రాయేలీయులు తమతో పాటు తీసుకు తెచ్చుకున్న జంతువులు,వస్తువులు అన్నీ తీసుకుని ఒక్కటి కుడా తడిసిపోకుండా ఫరో సైన్యాన్ని తప్పించుకుని పోగలిగారు.
ఫరో సైన్యం సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు వాళ్ళు కుడా సముద్రంలో అదే దారిని వెంబడించారు. అయితే సముద్రంలో బాగా లోతు ప్రాంతానికి చేరుకోగానే, నీళ్ళని వెనక్కి పట్టి ఉంచిన గాలి హఠాత్తుగా ఆగిపోయింది. సైన్యం సముద్రంలో చుక్కుపోయింది. నీళ్లు మరల ఉదృతంగా ప్రవహించే సరికి సైన్యం అంతా కొట్టుకుపోయింది. దేవుడు తన ప్రజల్ని ఫరో సైన్యం నుంచి రక్షించాడు.
నిర్గమకాండం 14
-నవీన్ కుమార్ యెలుమర్తి-
No comments:
Post a Comment