మోషే వెళ్లి ఫరో ముందు నిలబడి, "దేవుడు తన ప్రజలు ఐగుప్తును విడిచి వెళ్లాలని కోరుతున్నాడు"అని చెప్పాడు. కానీ ఫరో "కుదరదు" అని చెప్పాడు. పైగా ఐగుప్తులకులకు ఒక నోటీసు పంపించాడు ఇశ్రాయేలీయులు ఇంకా కఠినంగా పని చెయ్యాలని ఆదేశించాడు.
నిర్గమకాండము 6-12
ఫరో తన మాట వినడానికి ఇష్టపడలేదు గనుక, దేవుడు ఐగుప్తుమీదికి తెగుళ్లు పంపాడు. మొదట, దేవుడు ఐగుప్తులో ఉన్న నీళ్లును రక్తంగా మార్చాడు. నదులు,చెరువులు అన్ని రక్తంతో నిండిపోయాయి. త్రాగడానికి ఎక్కడ ఎవరికి మంచి నీళ్లు దొరకలేదు. అయితే ఫరో ఇంకా ప్రజలను పోనివ్వడు.
తర్వాత దేవుడు ఆ దేశమంతటిని కప్పలతో కప్పేసాడు. ఓ కప్పు మీద కాలెయ్యకుండా ఎవరూ నడవలేకపోయారు. ఫరో మోషేను పిలిచి, " నేను నీ ప్రజలను పోనిస్తాను. అయితే ముందుగా ఈ కప్పులను తీసేయ్ " అన్నాడు. దేవుడు ఆ కప్పులన్నిటిని తీసేసాక , ఫరో మనసు మార్చుకుని మరల ప్రజలను పోనివ్వలేదు.
దేవుడు పంపిన మూడవ తెగులు నేల మీద నుంచి వచ్చిన మిన్నల్లులు, ఎక్కడ చూచిన మిన్నాళ్లే, గుంపులు గుంపులుగా వచ్చాయి. తర్వాత దేవుడు ఐగుప్తు మీదికి ఈగల దండును పంపాడు. ఇళ్ల నిండా ఈగలు చేరి, ప్రతి దాని మీద ముసురుకున్నాయి. అది ఐగుప్తు ప్రజలు భరించలేకపోయారు. చివరకు ఫరో మోషేకు వాగ్దానం చేశాడు ప్రజలు వెళ్ళవచ్చని. అయితే ముందుగా ఈగలు పోవాలని. అయితే మరల దేవుడు ఈగలను,మిన్నాళ్ళు తీసివేయగా ఫరో మాట ఇచ్చినందుకు బాధపడ్డాడు.
అప్పుడు దేవుడు "ఐగుప్తులో పశువులన్నిటికి రోగం వస్తుందని" చెప్పాడు. అలాగే జరిగింది అనేక జంతువులు చనిపోయాయి కుడా, అయితే ఇశ్రాయేలీయుల పశువులు ఒక్కదానికి కుడా రోగం రాలేదు, ఆరవ తెగులు దద్దుర్లు, ఐగుప్తు ప్రజల శరీరమంతా వ్యాపించాయి నిలబడాలంటే చాలా కష్టంగా ఉండటంతో రోజంతా పడుకునే ఉండేవాళ్ళు. తర్వాత దేవుడు ఐగుప్తు మీదికి భయంకరమైన తుఫాను పంపించగా దానిలో పెద్ద వడగండ్లు కురిసి భూమి మీద ఉన్న ప్రతి మొక్కను,పంటను నాశనం చేశాయి. ఈ వడగండ్లు ఎంత పెద్దవంటే అవి ఇళ్ల పై కప్పుల మీద పడి రంధ్రాలు చేశాయి, రోజంతా వడగండ్ల వాన కురుస్తూనే ఉంది. ఐన సరే, ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తీ విడిచి వెళ్ళడానికి ఫరో తిరస్కరించాడు.
అప్పుడు దేవుడు ఐగుప్తు మీద అంతటి మీదకి మిడతల దండును పంపాడు. ఒక్క మిడతతో ఎలాంటి సమస్య ఉండదు కాని, లక్షలాది మిడతలు ఒకేసారి దండులా వస్తే మాత్రం భయంకరమైన తెగులవుతుంది. వడగండ్ల వాన తర్వాత మిగిలిపోయిన ప్రతి మొక్కను అవి తినేశాయి.
తర్వాత దేవుడు ఐగుప్తునంతా మూడురోజులపాటు చిమ్మ చీకటితో కప్పేశాడు. మిట్ట మధ్యాహ్నం వేళ కుడా చిమ్మ చీకటితో ఉండింది. అయినా, ఫరో ఇశ్రాయేలీయలను ఐగుప్తు విడిచి వెళ్లనివ్వలేదు.
అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు. "ఫరో త్వరలోనే మిమ్మల్ని పోనిస్తాడు. కాబట్టి నీవు వెళ్లి నీ ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పు. అదే రోజు ఐగుప్తులో ఉన్న ప్రతి తొలి బిడ్డ మరణించారు. ఫరో కొడుకు సైతం చనిపోయాడు. అయితే ఇశ్రాయేలీయులలో ఎవరు చనిపోలేదు. ఇది దేవుడు పంపిన పదో తెగులు, అన్నిటికన్నా దారుణమైనది. అదే రాత్రి ఫరో మోషేని కలిసి, "ఇంతవరకు నాకు జరిగింది చాలు. నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో" అని చెప్పాడు. హడావుడిగా ఇశ్రాయేలీయులు తమ సొంత వస్తువులన్నీ తీసుకుని ఐగుప్తు విడిచి వెళ్లిపోయారు.
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment