Saturday, 15 September 2018

THE BIG BOAT MADE OF NOAH & WATER FLOOD( నోవహు చేసిన పెద్ద పడవ & జలప్రళయం)

నోవహు చేసిన పెద్ద పడవ   :





అనేక సంవత్సరాలు గడిచి పోయాయి ,ఇప్పుడు భూమి నిండా మనుషులున్నారు . అయితే మనుషులు దేవుడు గురించి అంతా మరచిపోయారు, ఒకరికొకరు విపరీతమైన కీడు చేసుకుంటున్నారు. దీని వాళ్ళ దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు. అందుకని భూమ్మీద ఎక్కడైనా ఒక మంచి వ్యక్తి కనబడతాడేమో చూడాలని ప్రయత్నించాడు .దేవుడు వెతికాడు కానీ ఒకే ఒక్క మంచి వ్యక్తిని కనుగొన్నాడు. అతని పేరే నోవహు  . నోవహు దేవుణ్ణి ప్రేమించి ఆయన మాట విన్నాడు .
     దేవుడు నోవహుతో ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు.  అది నోవహు కుటుంబాన్ని ప్రపంచంలో ఉన్న జంతువులు ప్రాణుల్లో   ఆడ మగ  జతలుగా పట్టేంత పెద్దది . " ఆ ఓడ నీ కుటుంబాన్ని నిన్ను, జంతువులను  జలప్రళయం   నుండి కాపాడి మిమ్మల్ని కాపాడి క్షేమముగా ఉంచుతుంది " అని దేవుడు చెప్తాడు .
నోవహు అతని ముగ్గురు కుమారులు షేము , హాము,యాపెతు ఓడను నిర్మిస్తూ ఎన్నో సంవత్యరాలు గడిపారు. దేవుడు నోవహుకు ఇచ్చిన చూచనలును తూ .చ. తప్పకుండా పాటించి ఓడను నిర్మిస్తారు .

 జలప్రళయం :        

    ఓడ నిర్మాణం పూర్తికాగానే , దేవుడు ప్రతి జాతికి చెందిన జంతువును నోవహు దగ్గరకు పంపించాడు .జతలు జతలుగా అవి ఓడలో తమకోసం సిద్ధం చేసిన గదుల్లోకి ప్రవేశించాయి జంతువులన్నీ ఓడలోకి ప్రవేశించాక దేవుడే స్వయముగా ఆ ఓడకున్న పెద్ద తలుపును మూసేసాడు .
         తర్వాత వర్షం మొదలయింది .మొదట  నీళ్లు ,వీధుల్ని పొలాలని కప్పేశాయి. ప్రపంచమంతా వర్షం కురవ సాగింది. అప్పుడు ఇళ్ళు పట్టణాలు జలమయమయ్యాయి . మరింత వర్షం కురిసింది. అంతటితో ఓడ నెమ్మదిగా , భద్రంగా నీళ్లపై తేలడం మొదలుపెట్టింది. ఆ పెద్ద ఓడ గాలి వీచే దిశగా కదులుతూ ప్రపంచమంతటిని కప్పేసిన జల రాశిపై తేలియాడుతోంది అయితే  లోపల ఓడ పొడిగా , బధ్రంగా ఉండేలా ఎలా కట్టాలో దేవుడు నోవహును చెప్పాడు గనుక ఓడలో ఉన్నవాళ్లంతా క్షేమముగా ఉన్నారు. నలభై పగళ్లు నలభై రాత్రుల వరకు వర్షం కురుస్తూనే ఉంది .  పర్వత శిఖరాల సైతం ఓడను మునిగిపోయాయి . ఇప్పుడు భూమ్మీద ఇంకా  బ్రతికి ఉన్న మనుషులు ఒక్క నోవహు , అతని కుటుంబము తప్ప ఇంకెవరు లేరు అయితే దేవుడు నోవహును , అతని కుటుంబాన్ని, ఓడలో ఉన్న జంతువులన్నీటినీ మర్చిపోలేదు .
                                                                                                                      ఆదికాండం  6-2

                                                                      -నవీన్ కుమార్  యెలుమర్తి -

No comments:

Post a Comment