
ఆ విధంగా నిద్రలో ఉండగా అతనికో వింత అయిన కల వస్తుంది. అందులో ఒక నిచ్చెన ఆకాశం వైపు వెళుతుండటం చూశాడు దేవదూతలు ఆ నిచ్చెన మీద పైకి క్రిందికి వెళ్తూ ఉన్నారు దేవుడు ఆ నిచ్చెన పైభాగాన నిలబడి, "నీకు తోడుగా ఉండి, నిన్ను కాపాడి క్షేమముగా ఉంచుతాను. నీకు లెక్క పెట్టలేనంత పెద్ద కుటుంబము ఉంటుందని వాగ్దానం చేస్తున్నాను. మరియు నీ కుటుంబము ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన దీవెన ఇస్తుంది" అని యాకోబుతో చెప్పాడు.
తెల్లారి ఉదయం యాకోబు నిద్ర లేచినప్పుడు "దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను దీవించాలనుకున్నట్లు నాకిప్పుడు నిశ్చయంగా తెలుసు."అన్నాడు. అపుడు తాను తలగడగా పెట్టుకున్న ఆ రాయిని తీసుకుని దానిని నిలబెట్టి దానిపైన నూనెను పోసాడు. అదిప్పుడు దేవుడు యాకోబుతో కలలో మాట్లాడిన స్థలానికి గుర్తుగా ఉంది.
ఆదికాండము 25-33
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment