సృష్టి ఆరంభం :
ఆదియందు , ఇంకా కాలము ఆరంభం కాకముందు దేవుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడో చెప్తుంది బైబిల్ . భూమి సూన్యంగా , చీకటితో నిండి ఉంది ,దాని మీద జీవంగాని వెలుగు గాని లేవు . 6 రోజుల్లో దేవుడు ఈ ప్రపంచాన్ని, భూమి మీద జీవించే ప్రతి దాన్ని సృష్టించాడు .
దేవుడు సృష్టించిన మొట్ట మొదటిది వెలుగు. దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు అకస్మాత్తుగా , సూన్యముగా ఉన్న భూమి మీద పరుచుకొని ఎగిసిపడుతున్న నీళ్ళపైన మొట్టమొదటి దేదీప్యమానమైన వెలుగు ప్రకాశించడం ఆరంభించింది. ఆ వెలుగు మంచిదిగా ఉన్నట్లు దేవుడు చూసాడు ,ఆ వెలుగుకు పగలు అని పేరు పెట్టాడు చీకటినేమో రాత్రి అని పిలిచాడు .

ఇప్పుడు , భూమి అంతటా పరుచుకొని ఉన్న నీళ్లు వెనక్కి వెళ్లిపోవాలని దేవుడు ఆజ్జ్ణాపించాడు . దేవుడు భూమిని ఆరిన నేలగాను,పెద్ద సముద్ర జలాలుగాను వేరు చేశాడు . అది అలాగే జరిగింది . ఇప్పుడు ప్రపంచంలోకి పర్వతాలు,లోయలు వచ్చేశాయి సరస్సులు నదులు కూడా ఉన్నాయి.

అయితే భూమి అంతా చాలా నిశబ్ధంగా , ప్రశాంతంగా ఉంది ఎందుకంటే అప్పటికి ఇంకా
జీవము గల ఏ ప్రాణి సృష్టించబడ లేదు . 5వ రోజున దేవుడు సముద్రాలలో నదులలో చేపలను ,ఆకాశంలో ఎగిరే పక్షులను సృష్టించాడు.

6వ రోజున, భూమి మీద ఆరిన నేలపై తిరిగి రకరకాల జంతువులను దేవుడు సృష్టించాడు ఉదా : ఏనుగులు ,సింహాలు ,పులులు పశువులు ,గొర్రెలు ,కుక్కలు,పిల్లులు మొదలుకొని భూమ్మీద కనిపించే చిన్ని చిన్ని ప్రాణులు వరకు , నీవు ఉహించగల ప్రతి జంతువులను దేవుడు చేసాడు దేవుడు వీటినన్నిటిని సృష్టించినప్పుడు ''ఇదంతా చాలా చాల బావుంది'' అనుకున్నాడు. దేవుడు లోకాన్ని సృష్టించడం దాదాపు పూర్తి చేసాడు అయితే ప్రాముఖ్యమైనదేదో ఒకటి ఇంకా కనిపించడం లేదు . ఆయినా సృష్టి అంతటిలో మహా అద్భుతమైనది ఇంకా సృష్టించబడ లేదు అని దేవునికి తెలుసు
ఆదికాండము 1అ

-నవీన్ కుమార్ యెలుమర్తి -
very nice info bro
ReplyDeleteTq
ReplyDelete